epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టాక్సిక్‌లో నయన్ స్టన్నింగ్ లుక్.. యశ్ మూవీకి మరింత హీట్!

కలం, సినిమా : Nayanthara | కేజీఎఫ్ హీరో యశ్ (KGF Hero Yash) నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. కేజీఎఫ్ తర్వాత యశ్ ఎవరితో సినిమా చేస్తాడా..? ఏ తరహా సినిమా చేస్తాడా..? అని ఆతృతతో ఎదురు చూసిన జనాలకు షాక్ ఇచ్చాడు. అవును.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ మూవీ (Toxic Movie)ని అనౌన్స్ చేసి అందర్నీ సర్ ఫ్రైజ్ చేసి యశ్ ఇప్పుడు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు మార్చి 19న భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీలు కియారా అద్వానీ, హుమా ఖురేషి, సౌత్ బ్యూటీ నయనతార (Nayanthara) నటిస్తున్నారు. కియారా అద్వానీ, హుమా ఖురేషి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అందాల తార నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నయన తారని ఒక స్టన్నింగ్ లుక్ లో ప్రెజెంట్ చేస్తూ.. ఆమె గంగ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా రివీల్ చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా కథను యశ్, గీతూ మోహన్ దాస్ కలిసి రాయడం విశేషం. దీనిని బట్టి ఈ కథను యశ్ ఎంతగా ప్రేమించి రాసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అవుట్ ఫుట్ బాగుండాలనే ఉద్దేశ్యంతో చాలా సీన్స్ రీషూట్ చేశారు. ఇప్పుడు ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి ప్రమోషన్స్ లో మరింతగా స్పీడు పెంచనున్నారు. మరి.. యశ్ టాక్సిక్ తో కేజీఎఫ్ రేంజ్ సక్సెస్ సాధించి… సరికొత్త రికార్డులు సెట్ చేస్తాడేమో చూడాలి.

Read Also: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి చౌదరి?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>