కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా బీఆర్టీయూ (BRTU) అనుబంధ సంఘమైన కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సీడీఎంఏ (CDMA)ని కలిసి మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంగళవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే అనారోగ్యంతో సహజ మరణం పొందితే 5 లక్షల రూపాయలు, దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఇచ్చేలా తక్షణమే జీవో విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు కరీంనగర్ మున్సిపల్‌లో వర్కర్లకు ఒక పూట పని మాత్రమే కేటాయించాలని, డ్రైవర్లకు తగ్గించాలనుకుంటున్న జీతాన్ని రద్దు చేసి పాత జీతాన్నే యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ (BRTU) రాష్ట్ర అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్, మున్సిపల్ రాష్ట్ర అధ్యక్షులు చిలువేరు ప్రభాకర్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ జిల్లా అధ్యక్షులు దావు రాజమల్లయ్య, నగర అధ్యక్షులు గడ్డం సంపత్, డ్రైవర్ల అధ్యక్షుడు పొన్నం లింగయ్యలతో పాటు నిజామాబాద్, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు మరియు 25 మంది కార్మికులు పాల్గొన్నారు.
Also Read : కరీంనగర్ పోలీస్ స్టేషన్ నుంచే పెట్రోలింగ్ వాహనం చోరీ!
Follow Us On: X(Twitter)

