​’చలో హైదరాబాద్‌’ విజయవంతం చేయాలి: ఉద్యోగ జేఏసీ

​కలం, కరీంనగర్ బ్యూరో: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న నిర్వహించనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర ఉద్యోగ జేఏసీ (Employees JAC) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లోని టీఎన్జీవోల కమ్యూనిటీ భవనంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

నిర్లక్ష్యం వల్ల పురోగతి లేదు..

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఈహెచ్ఎస్ అమలులో నిర్లక్ష్యం: నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల పురోగతి లేదని మండిపడ్డారు. సీఎం సూచనలు చేసినా సమర్థవంతంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 2004 సెప్టెంబర్ 1 తర్వాత చేరిన ఉద్యోగులకు సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ వాటాలను వెనక్కి తీసుకురావాలి..

ఉద్యోగుల భవిష్యత్తును షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులకు తాకట్టు పెట్టకుండా, పెన్షన్ వాటాలను వెనక్కి తీసుకురావాని మారం జగదీశ్వర్ అన్నారు. పెన్షన్ అనేది బిక్ష కాదని.. ఉద్యోగి, అతని కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని.. కేవలం న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. పెండింగ్ బకాయిలు, పీఆర్‌సీ, ఈహెచ్ఎస్ లోపాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 10న హైదరాబాద్‌కు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

​ఈ సమావేశంలో జేఏసీ నాయకులు లింగారెడ్డి, కటకం రమేష్, స్థితప్రజ్ఞ, వెంకట్, సదానందం గౌడ్, శ్యామ్, దామోదర్ రెడ్డిలతో పాటు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల (TSGREA, TPCA, STU, PRTU, TRTF, DTF, PRGTA, TTU, REWA, TSUTF, SC-ST US తదితర) ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>