కలం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Nagarkurnool GGH) సూపరింటెండెంట్‌గా గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పి. సుప్రియ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ టి. ఉషారాణి 2025 జూలై నుంచి ఆస్పత్రి బాధ్యతలను పర్యవేక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు.
డాక్టర్ టి. ఉషారాణి పదవీకాలంలో ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విశేష కృషి చేశారని వైద్యులు, సిబ్బంది పేర్కొన్నారు. ఆస్పత్రి అభివృద్ధి, వివిధ విభాగాల పనితీరులో వచ్చిన మార్పులను గుర్తుచేసుకుంటూ మంగళవారం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, నర్సింగ్ అధికారులు, ఆర్‌ఎంవోలు, కార్యాలయ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

