కలం, వెబ్ డెస్క్ : మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాల్లో డయేరియా (Diarrhea) కలకలం రేపింది. కలుషితమైన నీరు తాగి వాంతులు, విరేచనాలతో ఏడుగురు చనిపోయారు. 30 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. భగీరత్ పుర ప్రాంతంలో ఈ కలుషిత నీరుతాగి 150 మందికి పైగా కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ డయేరియా ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కలుషిత నీరు తాగడం వల్లే ఇలా అయిందని అధికారులు గుర్తించారు.
మరణాలకు సంబంధించిన పూర్తి నివేదికలు ఇంకా రాలేదని తెలిపారు. పైప్ లైన్ దెబ్బ తినడం లేదంటే స్థానిక వాటర్ ట్యాంకులో నీరు కలుషితం కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో భగీరత్ పురలోని అసిస్టెంట్ ఇంజినీర్ ను సస్పెండ్ చేశారు. ఇన్ ఛార్జ్ సబ్-ఇంజినీర్ ను విధుల్లో నుంచి తొలగించారు. ఈ నీటి కాలుష్యం మీద విచారణ జరిపేందుకు కలెక్టర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు.

Read Also: పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి చౌదరి?
Follow Us On : WhatsApp


