కలం, వెబ్ డెస్క్ : పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి (Jhansi Reddy)పై ఆ పార్టీ సీనియర్ నేత హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), ఝాన్సీ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారన్నారు. జమస్తాన్పురంలో బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థికి ఝాన్సీరెడ్డి సపోర్ట్ చేశారని.. చెర్లపాలెం, మడిపల్లి, సోమారం గ్రామాల్లో ఝాన్సీరెడ్డి అనుచరులకు ఎర్రబెల్లి దయాకర్ రావు మద్ధతు ఇచ్చాడని హరిప్రసాద్ ఆరోపించారు.
కాంగ్రెస్ రెబెల్స్ గెలిస్తే వాళ్లను బలపరచినట్లు ఎర్రబెల్లి చెప్పుకుంటున్నారని హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. సోమారంలో ఎర్రెబెల్లికి ఏజెంట్లు కూడా లేరని.. మడిపల్లిలో ఎర్రబెల్లి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఉన్నాయని ఝాన్సీరెడ్డి (Jhansi Reddy).. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎర్రబెల్లి ఇద్దరూ ఒక్కటయ్యారని హరిప్రసాద్ (Hari Prasad) ఆరోపించారు. వీరి కోవర్ట్ బంధాన్ని త్వరలో బయటపెడుతామని సీనియర్ కాంగ్రెస్ నేత హరిప్రసాద్ హెచ్చరించారు. కాగా, హరిప్రసాద్ కోవర్ట్ వ్యాఖ్యలపై పాలకుర్తి రాజకీయాల్లో చర్చ మొదలయింది.
Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Follow Us On: X(Twitter)


