కలం, వెబ్ డెస్క్: మంత్రి సీతక్క (Seethakka) బుధవారం ములుగు జిల్లాలో పర్యటించారు. ములుగు సమీపంలోని గట్టమ్మ గుట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆలయాన్ని దర్శించి మీడియాతో మాట్లాడారు. న్యూ ఇయర్ వేడుకలకు తాడ్వాయికి (Tadwai) రావాలని పర్యాటకులను కోరారు. ములుగులో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయని, ఇటీవలే బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను కూడా ప్రారంభించామని తెలిపారు. 18 కి.మీ సఫారీ, కాకతీయుల కాలం నాటి కోట ఉందని, తాడ్వాయికి వచ్చే పర్యాటకుల కోసం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
మంత్రి కొండా సురేఖ సాయంతో ములుగులో (Mulugu) మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వసతులు కల్పించామని, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు త్వరలో వ్యూ పాయింట్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ములుగులో అడుగు పెట్టగానే ఆహ్లదకరమైన వాతావరణం ఆకట్టుకుంటుందని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు.
తాడ్వాయి.. తెలంగాణలోనే అద్భతమైన అడవి ప్రాంతం. ప్రకృతి ప్రేమికులకు మంచి గమ్యస్థానం. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు ఎక్కువగా తాడ్వాయికి వస్తుంటారు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి జలపాతాలు కూడా అద్భుతంగా ఉంటాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా చిల్ అవ్వాలనుకుంటే తాడ్వాయి బెస్ట్ ప్లేస్.
Read Also: అక్రమార్కుల అంతుచూస్తున్న ఏసీబీ.. సంచలనంగా వార్షిక నివేదిక
Follow Us On: Instagram


