epaper
Tuesday, November 18, 2025
epaper

క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా.. ?

Cancer Types | క్యాన్సర్.. అంటే ప్రతి ఒక్కరూ హడలెత్తిపోతారు. క్యాన్సర్ బారిన పడ్డానని ఎవరైనా చెప్తే వారిని చాలా జాలిగా చూస్తారు. క్యాన్సర్ వస్తే చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, దానిని మధ్యతరగతి వారు ఎఫోర్డ్ చేసుకోలేరని భావిస్తున్నారు. అది నిజమే.. కానీ, క్యాన్సర్ అంటే ఒక వ్యాధికాదు. అది అనేక వ్యాధుల సమూహం. దీని వల్ల శరీరంలోని కణాలు భారీ సంఖ్యలో విడిపోతాయి. ఒక ప్రదేశంలో పుట్టిన క్యాన్సర్ కణాలు.. శరీరమంతా వ్యాపిస్తాయి. క్యాన్సర్ కారణంగా విడిపోయిన కణాలన్నీ కూడా కణితులుగా మారుతాయి. అయితే అసలు క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. దాదాపు 200. అవును క్యాన్సర్ 200 రకాలు ఉన్నాయి. ఏ క్యాన్సర్ అయినా తొలి స్థాయిలోనే కనుగొంటే చికిత్స ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. మరి ఆ క్యాన్సర్‌లలో కొన్ని రకాల గురించి తెలుసుకుందాం..

Cancer Types : 

డక్టల్ కార్సినోమా: ఇది అవయవాలు, గ్రంథులు లేదా శరీర నిర్మాణ ఉపరితలాలను కప్పి ఉండే ఎపిథీలియల్ కణజాలంలో పుడుతుంది. ఉదాహరణకు.. కడుపులో వచ్చే క్యాన్సర్ దీని కిందికే వస్తుంది. ఇందులోనూ కొన్ని రకాలు ఉన్నాయి. అవి.. మెలనోమా, బేసల్ సెల్ క్యాన్సర్, పొలుసుల కణ చర్మ క్యాన్సర్, మెర్కెల్ సెల్ కార్సినోమా.

లుకేమియా: “లుకేమియా(Leukemia Cancer)” ను బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది ఎముక మజ్జ క్యాన్సర్, ఇది ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లను ఉత్పత్తి చేయకుండా మజ్జను నిరోధిస్తుంది. రక్తహీనతను నివారించడానికి ఎర్ర రక్త కణాలు అవసరం.

సార్కోమా: సార్కోమా అనేది మృదులాస్థి, కొవ్వు, కండరాలు, స్నాయువులు, ఎముకలు వంటి బంధన కణజాలాల నుంచి పెరిగే ప్రాణాంతక కణితి. సార్కోమా సాధారణంగా యువకులలో సంభవిస్తుంది. సార్కోమాకు ఉదాహరణలు ఆస్టియోసార్కోమా వంటి క్యాన్సర్లు.

సార్కోమా రకాలు: సాఫ్ట్ టిష్యూ సార్కోమా, ఆస్టియోసార్కోమా, బోన్ మారోవ్ ట్యూమర్, క్రోనోసార్కోమా

లింఫోమా: లింఫోమా క్యాన్సర్ లింఫాటిక్ సిస్టమ్ లోని నోడ్స్ లేదా గ్రంథులలో ఉద్భవిస్తుంది. ఇది తెల్ల రక్త కణాలు, శరీర ద్రవాలను క్లియర్ చేయడానికి లేదా మెదడు, రొమ్ముల వంటి అవయవాలలో బాధ్యత వహిస్తుంది. లింఫోమాను రెండు వర్గాలుగా విభజించవచ్చు. హాడ్కిన్స్ లింఫోమా, నాన్-హాడ్కిన్స్

లింఫోమా రకాలు: , హాడ్కిన్స్ లింఫోమా, నాన్-హాడ్కిన్స్ లింఫోమా, స్కిన్ లింఫోమా

Read Also: బాత్రూమ్‌లో మొబైల్ వాడితే పైల్స్ వస్తాయా..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>