జర్నలిస్టుల సమస్యలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) వెల్లడించారు. వారికి ఉన్న అన్ని సమస్యలను పరిస్కరిస్తామని అన్నారు. అదే విధంగా అక్రిడేషన్‌లపై కూడా ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే కొత్త అక్రిడేషన్ పాలసీని(Accreditation Policy) తీసుకొస్తామని, అమలు చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై బుధవారం పొంగులేటి సమీక్షించారు. అక్రిడేషన్ విధివిధానాలపై కూడా సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగానే జర్నలిస్టులు నిశ్చింతగా ఉండాలని ఆయన చెప్పారు. ‘‘జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అర్హులైన జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు. శాస్త్రీయ పద్ధతిలో పాలసీ రూపొందించాలని మంత్రి ఆదేశాలు. ఈ నెలాఖరు కల్లా పాలసీని ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హులైన జర్నలిస్టులకు త్వరగా కార్డులు జారీ చేయాలి’’ అని మంత్రి పొంగులేటి(Minister Ponguleti ) ఆదేశించారు.
Read Also: మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. మరో కేంద్ర కమిటీ సభ్యుడు లొంగుబాటు

