మెగా హీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు(Sambarala Yeti Gattu)’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందులో భాగంగానే తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రో మూవీ తర్వాత తనవి రెండు సినిమాలు ఆగిపోయాయని, అప్పుడు చాలా బాధేసిందని చెప్పాడు. కానీ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా నెవ్వర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమా చేయాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, కథ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నానని అన్నాడు. అలాంటి కథ ఇప్పుడు రోహిత్ తీసుకురావడంతో ఓకే చెప్పేశానని అన్నాడు. ఈ సినిమాను తాను అనుకున్న దానికన్నా రోహిత్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని సాయి దుర్గ తేజ్(Sai Dharam Tej) చెప్పుకొచ్చాడు.
‘‘ఈ సినిమా(Sambarala Yeti Gattu) కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇదొక పీరియాడికల్ డ్రామా మూవీ. రోహిత్ తీస్తున్న తీరు చూసి నేనే షాక్ అయ్యా. అందుకే ఈ మూవీ విషయంలో నాకెలాంటి టెన్షన్స్ లేవు. పక్కా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఇందులో నా లుక్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఆడియన్స్ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందడం పక్కా’’ అని అన్నాడు.
Read Also: పెళ్లి వేస్ట్.. డేటింగే బెస్ట్ అంటున్న ఫ్లోరాసైనీ

