మెంట్రాజ్ పల్లి సొసైటీ వద్ద ఎరువుల కోసం ధర్నా

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి (Mentrajpalli) సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా బుకింగ్ యాప్ లో 460 యూరియా బస్తాలు రెండు నిమిషాల్లో బుక్ అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులకు యూరియా దొరకడం లేదని రైతులు అంటున్నారు. గతేడాది వలె మళ్ళీ ఇప్పుడు కూడా ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఎరువుల పంపిణీ అనేది మండలం యూనిట్ గా ఉంది. మండలంలో ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ బుక్ చేసుకుంటున్నారు. ఒక గ్రామంలో స్టాక్ ఉంటే పక్క గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఆన్ లైన్ లో ఒక్కసారిగా బుక్ చేసుకోవడంతో నిముషాల్లో నో స్టాక్ అయిపోతుంది.

ప్రస్తుతం వరి పంట రెండో దశ అంటే పొట్ట దశలో ఉంది. దీంతో ఎరువుల డిమాండ్ ఎక్కువగా ఉంది. మూడు దశలకు వేర్వేరుగా పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. కానీ సకాలంలో ఎరువులు అందరికీ అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఏ గ్రామం వారికి అదే గ్రామంలో ఎరువులు పంపిణీ చేసేలా గ్రామ యూనిట్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం ఇందల్వాయి మండలంలో కూడా రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే సమస్య కనిపిస్తుంది. అధికారులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపి రైతులకు యూరియా అందేలా చూడాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>