మావోయిస్ట్ చరిత్రలోనే భయంకర దాడి.. కోర్ట్ సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ ప్రాంతంలో జీరం ఘాటి వద్ద 2013లో మావోయిస్టుల జరిపిన దాడి (Maoist Attack)లో 27 మంది మరణించిన కేసుకి సంబంధించి ఎన్ఐఏ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ దాడికి పాల్పడిన పది మందిని దోషులుగా నిర్ధారించింది. వీరికి త్వరలోనే శిక్షలు ఖరారు చేయబోతుంది. అప్పటి కేంద్ర మంత్రి మహేంద్ర కర్మ సహా కీలక నేతలు చనిపోయిన ఈ ఘటనను మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే అత్యంత భయంకర దాడిగా అభివర్ణిస్తుంటారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ వస్తోంది. తాజాగా కోర్టులో వాదనలు ముగిసి తుది తీర్పు వెలువరించింది.

అసలేం జరిగిందంటే..

2013 మే 25న అప్పటి కేంద్ర మంత్రి, సల్వా జుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ బస్తర్ జిల్లా దర్భా లోయలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌ పీసీసీ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లాతో సహా పదుల సంఖ్యలో కీలక నేతలు ప్రచారంలో ఉన్నారు. అప్పటికే మహేంద్ర కర్మను టార్గెట్ చేసిన మావోయిస్టులు.. జీరం ఘాటి వద్దకు రాగానే అందరిపై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మహేంద్ర కర్మ సహా 27 మంది చనిపోయారు. 38 మంది వరకు గాయపడ్డారు. చనిపోయినవారిలో పది మంది పోలీసులు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించడంతో పాటు మావోయిస్టులపై కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కారణమైంది.

13 ఏళ్ల విచారణ తరువాత..

ఈ ఘటనపై దర్భా పోలీస్ స్టేషన్‌లో తొలుత కేసు నమోదైంది. ఆ తరువాత దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. 2014లో తొలి ఛార్జిషీట్ నమోదు కాగా.. అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 13 ఏళ్లలో 294 సార్లు విచారణ జరిగింది. శనివారం తుది తీర్పు వెలువరించిన ఎన్ఐఏ కోర్టు.. పది మందిని దోషులుగా నిర్ధారించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>