కలం, వెబ్ డెస్క్: ప్రతి సంవత్సరం భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తే.. మరికొన్ని ఘోరంగా నిరాశపరుస్తాయి. ఈ ఏడాది విడుదలైన ఓ మూడు సినిమాలు తెలుగు (Tollywood) ప్రేక్షకులను ఘోరంగా నిరాశపర్చాయి.
వార్ 2: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ (NTR) కలిసి నటించిన ఈ మూవీపై బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలున్నాయి. స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ రూపొందింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటీపడి మరీ నటించారు. పాటలు, ట్రైలర్ అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎమోషన్స్ సీన్స్ పండకపోవడం, కీలక సన్నివేశాలు బోరింగ్‌గా ఉండటంతో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. కథకు సంబంధంలేని సీన్స్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాయి. దీంతో ఈ భారీ యాక్షన్ మూవీ బోల్తాకొట్టింది.
గేమ్ ఛేంజర్: రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎక్కువగా సాగే స్క్రీన్ ప్లే, కాలం చెల్లిన పాత కథ, ఎడిటింగ్ లోపం కారణంగా ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. అలాగే పసలేని మ్యూజిక్ కూడా ప్రేక్షకులకు చిరాకును తెప్పించాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.
కింగ్ డమ్: ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చాలా కష్టపడ్డాడు. అదరిపోయే లుక్‌లో కనిపించాడు. కానీ ఈ మూవీ సాగదీసినట్లుగా ఉంటుంది. సినిమాలో కొత్తదనం లోపించడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఓటీటీలో కూడా సోసోగా ఆడింది ఈ మూవీ.


