కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకల వేళ ముంబై ఎయిర్ పోర్ట్(Mumbai airport)లో భారీ ఎత్తున విదేశీ గంజాయి(foreign marijuana) పట్టుబడటం కలకలం రేపింది. లగేజ్ బ్యాగ్‌లో రహస్యంగా గంజాయి తరలిస్తున్న తొమ్మిది మంది విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… బుధవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీగా ఉంది. ఎయిర్ పోర్ట్ అధికారులు బ్యాంకాక్(Bangkok) నుంచి వచ్చిన తొమ్మిది మంది ప్రయాణికుల లగేజ్ తనిఖీ చేయగా రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం(NDPS Act) కింద కేసు నమోదు చేశారు. వీరు గతంలో కూడా గంజాయి రవాణా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల ఫోన్ల ఆధారంగా ఈ గంజాయి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


