కలం, వెబ్ డెస్క్: కొండా సురేఖను తొలగించడానికి ప్రధాన కారణం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఆమెను కనీసం ఖండించకపోవడమేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనగా ఏఐసీసీ తీవ్రంగా స్పందించి మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసిందన్నారు. చిన్నారెడ్డి కూడా అలా మాట్లాడాల్సి ఉండేది కాదన్నారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి పార్టీలో సీనియర్ నేతలైనా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందునే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ప్రకారమే ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని, మధ్యలో ఎవరి జోక్యం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని కొండా సురేఖ ఆరోపించడంలో అర్థం లేదని, ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు.
అసెంబ్లీ సమావేశాలే కీలకం..
కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశం కాదని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. హై కమాండ్ నిర్ణయాల మేరకే మంత్రి పదవుల ఎంపిక ఉంటుందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలపైనే తాము ఫోకస్ చేశామన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు సభలోనే సమాధానం చెబుతామన్నారు. ముందు ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేలా చూడాలని కేటీఆర్, హరీశ్ రావుకు సూచించారు.
Also Read : కుంభకర్ణుడిలా కేసీఆర్.. కాంగ్రెస్ వినూత్న నిరసన!
Follow Us On : WhatsApp

