కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ స్వర్గీయ ఎస్.జగదీశ్వర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. శుక్రవారం పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్‌లో జగదీశ్వర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో జగదీశ్వర్ రెడ్డి చూపిన చొరవ, పట్టుదల ఎంతో విలువైనవని అన్నారు. పార్టీలకు అతీతంగా మహబూబ్‌నగర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమైనదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కుంభకర్ణుడిలా కేసీఆర్.. కాంగ్రెస్ వినూత్న నిరసన!
Follow Us On: Instagram

