కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ (BRS Protests) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా నేటి నుంచి వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఉద్యమ (BRS Protests) కార్యాచరణను చేపట్టనుంది. ఆరు గ్యారెంటీటల వైఫల్యాలపై నేడు నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, బారీ ఫ్లెక్సీల ప్రదర్శన చేయనున్నారు. ప్రజలకు బకాయి ఉన్న హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డుల పంపిణీ బీఆర్ఎస్ చేయనుంది.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా చార్జ్‌షీట్ విడుదల చేయనుంది. ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వివిధ వర్గాల సమస్యలు వంటి అంశాలను చార్జ్‌షీట్‌లో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ చార్జ్‌షీట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
Also Read : నువ్వా-నేనా.. హీటెక్కిన ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ రాజకీయం!
Follow Us On: X(Twitter)

