కలం, జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను గుర్తు చేస్తూ జనగామ (Jangaon) లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై చేపట్టిన నిరసన (BRS Protest) కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని విమర్శించారు.
మహిళలకు రూ.2,500, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు కూలీలకు ఆర్థిక సాయం, కళ్యాణలక్ష్మి–షాదీముబారక్ తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటాలు కొనసాగుతాయని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా, మండల, గ్రామ, యువజన, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

