కలం, హనుమకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) విమర్శించారు. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులు గడిచినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపితే.. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అట్టడుగు స్థాయికి చేరిందని దాస్యం ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలు, అరాచకాలపై ఛార్జ్‌షీట్‌ను ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ప్రజల పక్షాన నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులతో అడ్డుకోలేరని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు.

