కలం, కరీంనగర్ బ్యూరో : ఆలయ నిర్మాణం కోసం వైకుంఠ ఏకాదశి రోజున ఓ యువకుడు వినూత్న నిరసన తెలిపాడు. మూడు ఏళ్ల క్రితం కరీంనగర్ (Karimnagar) లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని గొప్పలు చెప్పి నేటికి నిర్మాణ పనులు ప్రారంభించలేదని.. వెంటనే పనులు ప్రారంభించాలని కరీంనగర్ పట్టణ కేంద్రంలో శ్యాంకుమార్ అనే యువకుడు నిరసన వ్యక్తం చేశాడు.
మూడు సంవత్సరాల క్రితం కరీంనగర్ (Karimnagar) లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయం నిర్మాణం చేస్తామని భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో వెంకటేశ్వర స్వామిని గాలికి వదిలేశారని.. ఆలయం నిర్మాణం ఎప్పుడు అంటు ఆలయ నిర్మాణ ప్రదేశంలో ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజకీయ నాయకులు మేమంటే మేము నిర్మిస్తామంటు ప్రకటనలు చేసుకున్నారని ఇక్కడి వచ్చి చూస్తే పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నుంచి నిధులు తీసుకువచ్చామని ప్రచారం చేసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) లు సిగ్గు తెచ్చుకోవాలని శ్యాం కూమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరిత గతిన ఆలయ నిర్మాణ పనులు చేపట్టి 2026లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే : సీఎం రేవంత్
Follow Us On: Pinterest


