కేసీఆర్ రాజీనామా చేయాలి.. సీఎం రేవంత్ సవాల్

కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే అసెంబ్లీకి అయినా రావాలని సవాల్ విసిరారు. వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు దేశంలో కేసీఆర్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు.

ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయనకు సెక్యూరిటీ, ఇంటి దగ్గర కూడా భద్రత కల్పించేందుకు మరో రూ.21 కోట్లు ఖర్చయిందన్నారు. ప్రజా ధనం తీసుకుంటున్న బీఆర్ఎస్ అధినేతకు ప్రజల సమస్యలు పట్టవా.. అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు బాగా లేకపోతేనే బయటకు వస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరేం చేశారో తేల్చుకుందాం..

కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే గత పదేళ్లలో వారేం చేశారో.. వెయ్యి రోజుల్లో తాను ఏం చేశానో ప్రజల ముందు పెడుదామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రూ.6 వేల కోట్ల బకాయిలను రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించామని తెలిపారు. ఒకటో తేదీనే జీతాలు కూడా చెల్లిస్తున్నట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, తాము మాత్రం గతం రెండేళ్లలోనే 72 వేల ఉద్యోగాలు నియామకం చేశామన్నారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>