కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వడ్లకొండ నవీన్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాంచందర్పై 5 ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న మొత్తం 70 మంది పోలీస్ అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, నోడల్ అధికారి అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఎన్నికల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడు : వి. నవీన్ కుమార్ – పీసీ 291, శ్రీరాంపూర్ పీఎస్
ఉపాధ్యక్షులు : ఎన్. శ్రీనివాస్ – ఇన్స్పెక్టర్, సైబర్ క్రైమ్; ఎం. తిరుపతి – ఏఎస్ఐ, పెద్దపల్లి రూరల్ పీఎస్
ప్రధాన కార్యదర్శి : జె. అంజనేయులు – ఎస్ఐ, సీసీబీ రామగుండం
సంయుక్త కార్యదర్శి : కె. ఓంకార్ – పీసీ, రామకృష్ణాపూర్ పీఎస్
సంస్థాగత కార్యదర్శి : డి. వినోద్ బాబు – పీసీ, ఎన్టీపీసీ పీఎస్
కోశాధికారి : టి. సుందర్ సింగ్ – పీసీ, ధర్మారం పీఎస్
కార్యనిర్వాహక సభ్యులు : ఎం.డి. రిజ్వాన్ షా ఖాన్ – హెచ్సీ 714, డి. అనిల్ కుమార్ – పీసీ, సి.హెచ్. దేవరాజ్ – పీసీ
కార్యవర్గ సభ్యులు : ఎం. రాజిత – డబ్ల్యూపీసీ, ఎ. కపిల్ – ఏఆర్ పీసీ, డి. రాజం – ఏఆర్ఎస్ఐ
విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ నూతన సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వారి సంక్షేమం కోసం సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతన కార్యవర్గానికి సీపీ సూచించారు.

