కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో జరుగుతున్న పాంచజన్యం సభలో తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. బోధన్ ప్రాంతం నా మెట్టినిల్లు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కనీసం వంద సార్లు కేసీఆర్‌ను అడిగాను, కానీ పట్టించుకోలేదు. దీనికి కారణం కేటీఆర్ అని తెలిసింది. ఆయనకు బాగా సన్నిహితుడైన కోరుట్ల ఎమ్మెల్యే షుగర్ ఫ్యాక్టరీ కొనాలనుకున్నారట. వాళ్లు ఎందుకు కొనుగోలు చేయాలని భావించారో నాకు తెలియదు. రూ.18 కోట్లు ఇస్తే.. షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకునేది. తరువాత ఎన్నో సార్లు దీనిపై కొట్లాడినా తెరిపించలేకపోయాం. మొన్నటి ఎన్నికల్లో అందరూ కలిసి నన్ను ఓడగొట్టారు. వాళ్లు ఎవరో మీకు బాగా తెలుసు అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

