హ్యూమన్ రైట్స్‌ ఆర్గనైజేషన్‌లో సతీష్ యాదవ్‌కు కీలక పదవి

కలం, వనపర్తి: అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా. సతీష్ యాదవ్‌కు (Satish Yadav) మరో కీలక బాధ్యత దక్కింది. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్‌లో (Human Rights Organisation) ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. అఫ్జల్ చేతుల మీదుగా డా. సతీష్ యాదవ్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. తొలుత రెండు నెలల పాటు రంగారెడ్డి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అఫ్జల్ తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయిలో పూర్తిస్థాయి బాధ్యతలను సతీష్ యాదవ్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. అఫ్జల్, జాతీయ అధ్యక్షుడు, సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పేదలు, పీడిత వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. అఖిలపక్ష ఐక్యవేదికను రాష్ట్రస్థాయిలో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రజలకు మరింత చేరువ చేస్తామని సతీష్ యాదవ్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>