కలం, నాగర్కర్నూల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాగర్కర్నూల్ (Nagarkurnool) ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. తిమ్మాజిపేటలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని రాజేష్ రెడ్డి విమర్శించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో పేదలందరికీ నాణ్యమైన జీవన విధానం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

