మూసారంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో మూసీ నదిపై నిర్మించిన మూసారంబాగ్ కొత్త వంతెనను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఏటా వర్షాకాలంలో పాత వంతెన కారణంగా మూసారంబాగ్ , అంబర్ పేట వైపు వెళ్​లే వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రూ. 52 కోట్లతో 400 మీటర్ల పొడవైన కొత్త వంతెనను ప్రభుత్వం నిర్మించింది. తాజాగా ఈ వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

కాగా,  మూసీలో ల‌క్షా యాభై వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చినా ఇబ్బంది త‌లెత్త‌కుండా బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వి హ‌నుమంత‌రావు, ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబ‌ర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గ‌ణేష్ , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ , ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, మూసారంబాగ్ మధ్య ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గనుంది. మూసీ వరదల నుంచి ప్రయాణికులకు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>