కలం, వెబ్ డెస్క్ : ప్రభాస్ (Prabhas) గురించి డరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొన్న ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్న సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకున్నాడు. అలాగే సీనియర్ సీనియరే అని.. వాళ్ల దగ్గరి నుంచే మేం అన్నీ నేర్చుకున్నాం అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గురించే ప్రభాస్ ఈ కామెంట్స్ చేశాడనే విషయం తెలిసిందే. ఎందుకంటే సంక్రాంతికి ఈ సారి చిరంజీవి సినిమాతో ప్రభాస్ మూవీ పోటీ పడుతోంది.
ప్రభాస్ చేసిన కామెంట్స్ మీద తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ వ్యక్తిత్వానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ ఉన్న స్థాయికి అలాంటి మాటలు అనడం కేవలం ఆయనకే చెల్లుతుంది. అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా సీనియర్ నుంచే మేం అన్నీ నేర్చుకున్నాం. సీనియర్ తర్వాతే మేం అని చెప్పడం అంటే ప్రభాస్ ఎంత మంచి వ్యక్తి అనేది ఇక్కడే అర్థం అవుతుంది. అందుకే ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. జనవరి 8న ది రాజాసాబ్ ప్రీమియర్స్ కు వెళ్లి సెలబ్రేట్ చేస్తాం’ అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి.
Read Also: సన్నీలియోన్ ప్రోగ్రామ్ పై సాధువుల ఆగ్రహం
Follow Us On: Sharechat


