కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వార్డులో సమస్యలపై పట్టు ఉన్న తమను వదిలి నేరుగా వార్డుల్లో అధికారులు తిరగడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం ముందు నిరసన తెలిపారు. తమ వార్డులో అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
తన వార్డులో నెల క్రితమే జేసీబీతో పని చేయిస్తుంటే మధ్యలోనే తీసుకెళ్లారని, ప్రస్తుతం అదే పని తనకు చెప్పకుండా వచ్చి జేసీబీతో చేయించడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్ ప్రశ్నించారు. ఏదైనా అడిగితే షబ్బీర్ అలీ (Shabbir Ali) చెప్పారు, నయీమ్ చెప్పారని పనులు చేస్తే తాము ఉండి ఎందుకుని ఆయన ప్రశ్నించారు. ఇక తాము వార్డులకు అవసరం లేదని.. రాజీనామా చేస్తామని, పనులు చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నల్ల కండువా కప్పుకొని కౌన్సిల్ టేబుల్ పై వేసి నిరసన తెలిపారు.
Also Read : మేళ్లచెరువు వేపచెట్టు వివాదంలో బిగ్ ట్విస్ట్!
Follow Us On: X(Twitter)

