ఉట్నూర్‌ క్రీడా ర్యాలీలో బొజ్జు పటేల్.. విద్యార్థుల్లో ఫుల్ జోష్

కలం, నిర్మల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్ (Utnoor)  మండల కేంద్రంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రీడా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) ర్యాలీలో పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో ఇటీవల వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాణించిన క్రీడాకారులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం వారికి స్పోర్ట్స్ కిట్లను అందజేసి ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంచుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా రంగంలో తమ ప్రతిభను చాటుతూ ఉట్నూర్ (Utnoor) ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

Also Read : ‘సర్’పై ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>