కలం, వెబ్ డెస్క్: రేపు నీట్ పీజీ పరీక్ష జరగబోతుండగా.. హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యశ్విత (Yashwitha) అనే నీట్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అపరాజిత విమెన్ హాస్టల్లో ఉంటూ గత ఆరు నెలలుగా యశ్విత నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. రేపు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఇంతలోనే విషం తాగి బలవన్మరణానికి పాల్పడటంతో అంతా షాకయ్యారు.
చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆమె గురించి ఆరా తీయగా కర్నూల్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తెగా తేలింది. వారికి సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్యహత్యకు మానసిక ఒత్తిడే కారణమా.. మరేదైనా కారణమా.. అనే అంశంపై విచారిస్తున్నారు.
Also Read : వరల్డ్ కప్ గెలిచాడు.. టీమ్‌లోనే చోటు పోయింది!
Follow Us On: X(Twitter)

