సొంతపార్టీ నాయకులపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాల పార్టీ కమిటీలను ప్రకటిస్తున్న సమయంలో, లిస్టులో ఉన్న పలువురు నాయకులు సమావేశానికి గైర్హాజరు కావడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి, జనాల్లో నిరంతరం తిరిగే వారిని మాత్రమే మండల కమిటీల్లోకి తీసుకోండని ఫైర్ అయ్యారు. అంతే తప్ప ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేసే వారికి కమిటీల్లో స్థానం ఇవ్వొద్దని సూచించారు. మీటింగ్‌కు హాజరుకాని నాయకులను తక్షణమే మండల కమిటీల లిస్టు నుంచి తొలగించాలని, వారి స్థానంలో క్రమశిక్షణతో సమావేశానికి హాజరైన వారి పేర్లను చేర్చాలని కమిటీ ప్రెసిడెంట్లను జగ్గారెడ్డి ఆదేశించారు.

తన ఇంట్లో ఎల్లుండి కొడుకు నిశితార్ధం ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చానని జగ్గారెడ్డి (Jagga Reddy) వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అందరూ ఏర్పాట్లలోనే నిమగ్నమై ఉంటారని.. కానీ తాను మాత్రం ఉదయం 11 గంటలకే సంగారెడ్డికి వచ్చి పార్టీ సమావేశంలో పాల్గొన్నానని తెలియజేశారు. తనకు రాజకీయం అంటే షోకు కాదని, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటుందని తేల్చి చెప్పారు. అందుకే ఇలాంటి సమయాల్లోనూ ప్రజల్లో, నాయకుల మధ్య ఉంటున్నానని తెలిపారు. రాజకీయాల పట్ల సీరియస్ లేని వారికి పదవులు ఎందుకు? అంటూ ప్రశ్నించారు.

Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>