కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చింతల అగ్రహారం ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు (Visakhapatnam Suicide) పాల్పడటంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి.
మల్లా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య అహల్యతో పాటు ఇద్దరు పిల్లలకు విషం తినిపించి, ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

