కలం, వెబ్ డెస్క్ : అరకులో కాఫీ తోటలు పెంచమని చెప్పింది తానేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే ప్రాంతీయ ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కాఫీ తో పాటు మిరియాల చెట్ల పెంపకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహించిందని ఆయన గుర్తుచేశారు.
అరకు లోయ పర్యటనలో భాగంగా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంజీవని కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఆదివాసీ కుటుంబాలకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వేగవంతమైన వైద్యం అందుతుందని తెలిపారు. సేకరించిన టెస్ట్ శాంపిల్స్‌ను డ్రోన్ ద్వారా పాడేరులోని ల్యాబ్‌కు పంపించి, పరీక్ష పూర్తయిన తర్వాత నివేదికలను నేరుగా ప్రజల ఫోన్లకే పంపేలా ఏర్పాట్లు చేశామని, అందుకే ఈ ప్రాంతంలో డ్రోన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని సీఎం వెల్లడించారు.

