కలం, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) మంగళవారం ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) జరిగింది. ఈ ఘటనలో దాదాపు 7 మంది చనిపోయారు. అల్మోరా జిల్లాలోని సాల్ట్ భికియాసైన్ ప్రాంతంలో నిన్న రాత్రి ప్రయాణికులతో వెళ్లిన బస్సు లోతైన లోయలో పడిపోయింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు (Police), జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పర్వత భాగం కావడంతో సహాయ చర్యలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. గాయపడినవారిని లోయ నుండి బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం, మృతుల వివరాలను ధృవీకరించిన తర్వాత వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

Read Also: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. ట్రంప్ కు దేశ అత్యున్నత పురస్కారం!
Follow Us On: Sharechat


