కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి బేగం ఖలీదా జియా (KhaledaZia) (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న ఆమె, ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:00 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ సందర్భంగా BNP మీడియా సెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని ఏళ్లుగా ఖలీదా జియా (KhaledaZia) పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరం నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమెకు పరిస్థితి విషమించడంతో డిసెంబర్ మధ్యలో వెంటిలేటర్ సపోర్ట్ అందించారు. విదేశీ వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


