epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విశ్వంభర వచ్చేది అప్పుడేనా?

కలం, వెబ్ డెస్క్​ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర ( Vishwambhara ). ఈ మూవీకి మల్లిడి వశిష్ట్​ డైరెక్టర్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఆ మధ్య ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తే.. ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. దీంతో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని.. లేట్ అయినా ఫరవాలేదు లేటెస్ట్ గా రావాలని టైమ్ తీసుకుని వర్క్ చేస్తున్నారు. అయితే.. రిలీజ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతం ఫోకస్ అంతా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పైనే ఉంది. మరి.. విశ్వంభర వచ్చేది ఎప్పుడు..?

విశ్వంభర పోస్ట్ పోన్ అని ప్రకటించినప్పుడు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పిల్లలు అందరూ చూసేందుకు వీలుగా సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే.. రిలీజ్ డేట్ చెప్పలేదు. ఈ సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుంది. కాబట్టి జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజైన మే 9నే ఈ సినిమాను కూడా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు లేటేస్ట్ న్యూస్ ఏంటంటే.. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజైన తర్వాత ఆరు నెలల గ్యాప్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట.

ఈ లెక్కన విశ్వంభర చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. సీజీ వర్క్ విషయంలో పట్టుదలగా ఉన్నారట. బాగా వస్తేనే కానీ.. రిలీజ్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. న్యూయర్ లో Vishwambhara రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మరి.. విశ్వంభర థియేటర్స్ లోకి మే లో వస్తుందో.. జూన్ లో వస్తుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>