బిగ్ అలర్ట్.. గోవూర్ శివారులో చిరుత సంచారం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Leopard Nizamabad) జిల్లా మోస్రా మండలం గోవూర్ శివారులో చిరుత పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు ధృవీకరించారు. మోస్రా, చింతకుంట, తిమ్మాపూర్, 6 నంబర్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. రైతులు పంట పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని, చప్పుడు చేస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>