నిర్మల్ ఎస్సీ కార్పొరేషన్‌ దుకాణాలకు వేలం

కలం, నిర్మల్‌: నిర్మల్‌ (Nirmal) ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 4, 5, 10 నంబర్ల దుకాణాలను కిరాయి కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి శంకర్ తెలిపారు. వచ్చే నెల సెప్టెంబర్‌ 1న ఉదయం 11.30 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. నిర్ణీత దరఖాస్తును ఈ నెల 31న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

వేలంలో పాల్గొనే వారు కుల, ఆదాయ, రేషన్‌ కార్డు, నివాస, ఆధార్‌ తదితర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ ప్రతులతోపాటు రూ.50 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో దుకాణం దక్కిన వారు నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>