కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు హైటెక్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన కంపెనీ ‘మిల్చీ మిల్క్’ పాలను కొనేలా పలు ప్రైవేట్ ఆసుపత్రులతో వ్యాపారం చేశారని వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఊరూ పేరూ లేని కంపెనీ పేరుతో లావాదేవీలు జరిపారని విమర్శించారు. బీజేపీ నేతల సంస్థలతో పాటు వైద్యారోగ్య మంత్రిగా ఆసుపత్రులతోనూ హరీశ్ రావు వ్యాపారం చేశారని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు అగ్గిపెట్టె రావు ‘ఆర్థిక ఆరోగ్యం’ ఎంతో మెరుగుపడిందని.. అయితే ఆయన అవినీతి సామ్రజ్యంలో పాల కంపెనీ చిన్న ఉదహరణే అన్నారు.
వెబ్సైట్ ఎందుకు మూసేశారు..?
బీజేపీ నేతలతో తన వ్యాపార సంబంధాలు బయటపడటంతో హరీశ్ రావు కంపెనీ వెబ్ సైట్ మూసేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రభుత్వ భూములు అమ్మడం, వాటిలో పర్సంటేజీలు తీసుకోవడం, బండారం బయటపడిన తరువాత వెబ్సైట్ మూసివేయడం ఆయనకు అలవాటే అన్నారు. 22ఏ భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని, బీఆర్ఎస్ నేతలు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

