‘నమ్మించి గొంతు కోశారు’.. జోగి రమేశ్‌ను నిలదీస్తూ ఏడ్చేసిన మేఘన !

కలం, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి , కోడలు మేఘన(Jogi Meghana)కు జరుగుతున్న వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ నపుంసకుడని ఆయన కోడలు చేసిన ఫిర్యాదును ఖండించిన జోగి రమేశ్.. వారిద్దరికి గొడవలు రావడం వల్లే విడిపోయారని నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపారు. అయితే తాజాగా జోగి రమేశ్ వ్యాఖ్యలకు మేఘన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో జోగి రమేశ్ కుటుంబపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

గతేడాది మే నెలలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తో తనకు పెళ్లి జరిగిందని.. జోగి రమేశ్ మీద ఉన్న నమ్మకంతో  తన తండ్రి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారని మేఘన అన్నారు. అయితే రాజీవ్ కు సమస్య ఉన్న సంగతి వారి కుటుంబ సభ్యుల అందరికీ తెలుసునని.. అయిన కూడా అతనితో తనకు పెళ్లి చేసి గొంతు కోశారని వాపోయారు. ఈ క్రమంలోనే కొడుక్కి సమస్య ఉంది అని తెలిసిన కూడా తనను బలిచేశారు? ఇది నేరాం కాదా? అని జోగి రమేశ్ ను నిలదీస్తూ ఎమోషనల్ అయ్యారు. మీ కూతురికి ఇలా జరిగితే ఏం చేస్తారు ? అని ప్రశ్నించారు.

అంతేకాదు పెళ్లి సమయంలో హిందువులం అని చెప్పి జోగి రమేశ్ కుటుంబం తనను మోసం చేసిందని మేఘన అన్నారు. తనను కూడా క్రిస్టియన్ లోకి మారాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. అదనపు కట్నం తీసుకువస్తే హ్యామీ గా ఉంటావు.. అప్పుడే అతనికి ఫీలింగ్స్ వస్తాయని తన అత్త మాట్లాడిందని సంచలన ఆరోపణ చేశారు. సింపథీ, రాజకీయాల కోసం తాను ఆరోపించినట్లు జోగి రమేశ్ అంటున్నారని.. అసలు వాస్తవాలు తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించానని అన్నారు. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>