కలం, నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో నం 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో టీజీవీపీ, పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు (Polytechnic Students) సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడారు.
శక్తి స్కీం, జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను పరిరక్షించాలని నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల సాంకేతిక విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శక్తి స్కీం, జీవో నం 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : కొండా సురేఖపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

