వారికి ఇక చుక్కలే.. తేల్చి చెప్పేసిన పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: నిషేధిత భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) విమర్శించారు. గత ప్రభుత్వంలో దొంగ జీవోలు తెచ్చి ప్రభుత్వ భూములు కొట్టేశారని మండిపడ్డారు. అలాంటి జీవోలతో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.

ప్రతి సోమవారం 22ఏ భూముల (22A Lands) అంశంపై సమీక్ష చేస్తున్నట్లు వివరించారు. పక్కా భూముల్లో ఇప్పటికే 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. రిజిస్ట్రేషన్లపై ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. టోల్ ఫ్రీ నెంబరుకి ఇప్పటికీ 1162 కాల్స్ వచ్చాయన్నారు. సీఎస్7, సీఎస్14 భూములపై దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. నిషేధిత భూముల సమస్యను త్వరలోనే పూర్తిగా పరిష్కారమవుందని స్పష్టం చేశారు.

Also Read : బీజేపీ నేత‌ల‌కు చుర‌క‌లంటించిన సీఎం రేవంత్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>