కలం, వెబ్ డెస్క్: ఓ హోటల్ లో ‘బాసింగ బలాలే’ ఫేమ్ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి-మాధురీ రాథోడ్ (Madhuri Rathod) రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీడియో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ ఈశ్వర్ సాయి (Eshwar Sai) ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేయగా.. తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియోను రిలీజ్ చేశాడు.
హోటల్‌లో ఏం జరిగిందనేది 10 శాతం మాత్రమే జనాలకు తెలుసు అని, మిగతా 90 శాతం తెలియదని ఆ వీడియోలో ఈశ్వర్ సాయి తెలియజేశారు. తాను ఉదయం 4 గంటలకు లేచేసరికి తన గదిలోని బాత్రూంని అసిస్టెంట్ ఉపయోగిస్తున్నాడని చెప్పారు. దీంతో తాను మాధురి రాథోడ్ వాష్‌రూంకి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో తన భార్యకు ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె అక్కడకి వచ్చి రచ్చ రచ్చ చేసిందని వెల్లడించారు. ఆ సమయంలో తాను చెప్తే వినే పరిస్థితిలో కూడా తన భార్య లేదన్నారు.
అయితే తాను, మాధూరి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ.. తమ మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో లేదంటూ ఈశ్వర్ సాయి (Eshwar Sai) వ్యాఖ్యానించారు. తమ మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉందని.. అయితే అది కూడా తప్పేనని తెలిపారు. తన వల్ల మాధురి రాథోడ్‌కు జరిగిన డ్యామేజ్‌కు క్షమాపణ చెప్తున్నానని .. దయచేసి ఈ విషయాన్ని అందరూ ఇంతటితో ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : బీజేపీ నేతలకు చురకలంటించిన సీఎం రేవంత్!
Follow Us On: X(Twitter)

