డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం రాంనగర్‌ వాసుల ఆందోళన

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీకి చెందిన నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను వెంటనే కేటాయించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే నిర్వహించి అర్హులకు టోకెన్లు సైతం అందజేశారని, అయినప్పటికీ ఇప్పటివరకు ఇళ్ల కేటాయింపు జరగలేదని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే అర్హుల జాబితాను పరిశీలించి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కేటాయించి నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>