గుజరాత్‌లో క‌ల్తీ పాల క‌ల‌క‌లం..!

క‌లం, వెబ్ డెస్క్‌: గుజ‌రాత్‌లో క‌ల్తీ పాల (Adulterated Milk) దందా వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. జామ్ న‌గ‌ర్ జిల్లా హ‌రిప‌ర్ ప్రాంతంలో క‌ల్తీ పాలు త‌యారు చేస్తున్నార‌నే అనుమానంతో రాజ్‌కోట్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 7,150 లీట‌ర్ల క‌ల్తీ పాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాల‌లో ప్ర‌మాద‌కర ర‌సాయ‌నాలు క‌లుపుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. పాల న‌మూనాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపించారు. అలాగే పాల కేంద్రంలో పాల త‌యారీకి వినియోగిస్తున్న ర‌సాయ‌నాలు, సామ‌గ్రిని జ‌ప్తు చేశారు. బాధ్యుల‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>