కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) లయన్స్ క్లబ్, సుప్రభాత్ లయన్స్ క్లబ్, పాలమూరు లయన్స్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్‌లోని బాల్ భవన్‌లో నిర్వహించిన ఉచిత వెరి కోస్ వేయిన్స్ వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌కు చెందిన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ప్రారంభించారు.
డాక్టర్ దివ్య, మార్కెటింగ్ హెడ్ జగదీష్, హెల్త్ కౌన్సిలర్ నజీర్‌ల ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నటరాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ సుదర్శన్, ఆయా క్లబ్ ల ప్రతినిధులు చెన్నయ్య, ప్రవీణ్ కుమార్, బాబుల్ రెడ్డి, నాగరాజు, వినోద్, వై. ప్రవీణ్, యతి రాజాచారి, లయన్ అశ్విని చంద్రశేఖర్, బాల్ రాజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

