అయోధ్య‌లో ఫిష్ పార్టీ.. వివాదంలో కాంగ్రెస్ నేత‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయోధ్య‌లో జ‌రిగిన ఓ ఫిష్ పార్టీ (Ayodhya Fish Feast) తీవ్ర వివాదానికి దారి తీసింది. యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్‌కి స్వాగ‌తం ప‌లుకుతూ నేడు అయోధ్యలో ఫిష్ ఫీస్ట్ నిర్వ‌హించారు. అయితే పవిత్ర శ్రావణ మాసంలో ఇలాంటి మాంసాహార ఏర్పాట్లు చేయడం ఏమిట‌ని స్థానిక మత గురువులు, సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సనాతన ధర్మానికి, హిందూ మనోభావాలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ పార్టీ ఏర్పాట్లను నిర్వాహ‌కులు బ‌లంగా స‌మ‌ర్థించుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన ఫుడ్ తినే హక్కు ఉందని వాళ్లు చెప్తున్నారు. నిషాద్ సామాజిక వర్గ సాంప్రదాయంలో చేపలు పట్టడం, తినడం భాగమని, శ్రావణ మాసమైనా ఏ ఇతర మాసమైనా వ్యక్తుల ఆహారపు అలవాట్లపై ప్రశ్నలు లేవనెత్తకూడదని వారు వాదిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>