క‌ల్యాణ ల‌క్ష్మిపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌: బీజేపీ నేత బ‌ల‌రాం రెడ్డి

కలం, మక్తల్: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రజల్లో భయాందోళన నెలకొందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి (Balaram Reddy) ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఎంతగానో అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌న్నారు. ఈ రెండు పథకాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న మేలు, అలాగే పథకాల విధివిధానాలపై హైకోర్టుకు ప్రభుత్వం సరైన వాదనను వినిపించకపోవడంతోనే ఈ పథకాలను నిలిపివేయాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరినా, నిర్ణీత గడువులోగా ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే శాసనసభ, శాసన మండలిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత కల్పిస్తూ సమగ్ర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది కలగకుండా నిధుల విడుదలపై ఉన్న న్యాయపరమైన అడ్డంకులను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ అసమర్థతను బీజేపీ ఆధ్వర్యంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>