నిర్మల్‌లో అయ్యప్ప సేవా సమితికి నూతన కార్యవర్గం

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ నందిగుండం దుర్గామాత ఆలయంలో ఆదివారం అయ్యప్ప సేవా సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బద్రి శ్రీనివాస్, కార్యదర్శిగా కనపర్తి విగ్నేష్, కోశాధికారిగా కుంటాల సాయినాథ్, గౌరవ అధ్యక్షుడిగా జాప ప్రకాష్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సాదం ఆనంద్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>