22-A అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా: దినేష్ పటేల్ సవాల్

కలం, నిజామాబాద్ బ్యూరో : ‘22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) సవాల్ విసిరారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. 22-A భూముల అంశంపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందూరు జిల్లాలో ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానని స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా చర్చకు రావచ్చని, తాను అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

కాంగ్రెస్ నాయకులకు ఈ అంశంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ చర్చకు రాకపోతే, 22-A భూముల సమస్యపై రాష్ట్ర పార్టీ సూచన మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు 22-A భూముల వల్ల జరుగుతున్న నష్టాన్ని, వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు నిన్న వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, డిప్యుటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు యాదల నరేష్, బెల్లల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, ST మోర్చా అధ్యక్షులు ఓం సింగ్, మహిళా మోర్చా అధ్యక్షులు మారెడ్డి వనిత, యువ మోర్చా అధ్యక్షులు వంశీ గౌడ్, యువ మోర్చా రాష్ట్ర కో కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు SR సత్యపాల్, నాయిడి రాజన్న, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, జగన్ రెడ్డి, ఆనంద్, రాకేష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>